ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం సంతోషంగా ఉంది..

– రెవరెండ్ డాక్టర్ సంఘాల పాల్సన్ రాజ్
నవతెలంగాణ-ధర్మసాగర్
క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిర నిర్మాణం ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం చాలా సంతోషకరంగా ఉందని వ్యవస్థాపకులు డాక్టర్ సంఘాల పాలసన్ రాజ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కరుణాపురం గ్రామంలో క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో రెవరెండ్ డాక్టర్ సంఘాల పాల్సన్ రాజ్, దైవజనులు డాక్టర్ జయప్రకాష్ ఆధ్వర్యంలో థాంక్స్ గివింగ్ కార్యక్రమం సందర్భంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంను, నిర్మించి మే 24,2023 సంవత్సరంలో ఘనంగా ప్రారంభించడం జరిగినది గుర్తు చేశారు. ఇంతటి గొప్ప కట్టడం గూర్చి , ఒకేసారి 40 వేల మంది ప్రార్థన చేసే అనుకూలమైన ఈ కట్టడాన్ని,ఇక్కడ జరిగే విశిష్ట సేవలను గుర్తించిన అగ్ర రాజ్యం అమెరికా దైవ సేవకులు జూన్ 16 న  అమెరికన్ మల్టీ ఎథినిక్ కొలీషన్ వారు ఆహ్వానించి, కాంగ్రెషనల్ గ్లోబల్ కమ్యూనిటీ ఆస్కార్ అవార్డ్ ప్రధానం చేయడం జరిగిందని తెలిపారు. నిస్వార్థమైన సేవకు ఆ భగవంతుడు అమెరికా ఎం.పి చేతుల మీదుగా ఈ అరుదైన అవార్డు ప్రధానం చేయడం చాలా  గొప్ప విషయం అన్నారు.ఈ అంతర్జాతీయ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉన్నదని,ఇది అద్భుతమని ఇది అంతా దైవ కృప వల్లనే సాధ్యమైయిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ అవార్డు ప్రోత్సహకము నా దేశ ప్రజల శాంతి, సేవలకు నాకు ఎంతో ప్రోత్సహాన్నిస్తుందని,భవిష్యత్తు లో దైవ కృపతో ఇంకా మరెన్నో అద్భుత కార్యాలు జరగాలని ఆశిస్తున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో దైవ జనులు డాక్టర్ జయప్రకాష్, ప్రార్ధన మందిరం పెద్దలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.