నేను స్టూడెంట్‌ సార్‌.. రిలీజ్‌కి రెడీ

హీరో బెల్లంకొండ గణేష్‌ తాజాగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్‌ సార్‌’. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పై ‘నాంది’ సతీష్‌ వర్మ నిర్మించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా నుంచి ’24/7 ఒకటే ధ్యాస’ సాంగ్‌ను రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో యువ హీరో విశ్వక్‌ సేన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”టీీజర్‌ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. హీరో గణేష్‌ కాంటెంపరరీ కథలతో వస్తున్నాడు. సాగర్‌ అమేజింగ్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు’ అని తెలిపారు.
‘ఫోన్‌ కొనడానికి కష్టపడుతూండగా వచ్చే మాంటేజ్‌ సాంగ్‌ ఇది. చాలా ఎంజారు చేసేలా ఉంటుంది. జూన్‌ 2న మా సినిమా విడుదలవుతుంది’ అని హీరో బెల్లంకొండ గణేష్‌ అన్నారు. దర్శకుడు రాఖీ మాట్లాడుతూ, ‘విశ్వక్‌ సేన్‌ మా సాంగ్‌ను విడుదల చేయడం ఆనందంగా వుంది. ఓ మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రమిది’ అని తెలిపారు. ‘ఈ సినిమాని ముందే విడుదల చేయాలనుకున్నాం. కానీ స్టూడెంట్స్‌కు పరీక్షలని ఆగాం. ఈరోజు విడుదల చేసిన సాంగ్‌ వివిధ లొకేషన్లలో తీశాం. హీరో క్యారెక్టర్‌ ఏమిటో ఈ సాంగ్‌ ద్వారా చెప్పాం’ అని నిర్మాత నాంది సతీష్‌ వర్మ తెలిపారు.

Spread the love