దేశాన్ని రక్షించాను..నా భార్యను కాపాడుకోలేకపోయా..

– కార్గిల్‌ యుద్ధ వీరుడి ఆక్రందన
– మణిపూర్‌లో మహిళల్ని నగంగా ఊరేగించిన ఘటన ఎంత ఆవేదన కలిగిస్తోందో.. ఈ బాధిత మహిళల్లో
ఒకరు దేశాన్ని రక్షించే సైనికుడి భార్య అన్న విషయం కూడా అంతే ఆవేదన కలిగిస్తోంది. కార్గిల్‌ యుద్ధంలో పాల్గొని దేశాన్ని రక్షించుకోగలిగాను కానీ.. అవమాన భారం నుంచి తన భార్యను రక్షించుకోలేకపోయానని ఆ సైనికుడు ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు. సుమారు మూడు గంటల పాటు ఈ నరకయాతన కొనసాగిందని, తన భార్య ప్రాణాలతో భయటపడినా.. తీవ్ర మానసిక క్షోభ, భయాందోళనలను ఇప్పటికీ అనుభవిస్తోందని తెలిపారు. ‘కార్గిల్‌ యుద్ధ సమయంలో ముందు వరసలో ఉండి పోరాటం చేశాను. ఇప్పడు యుద్ధభూమి కంటే నా స్వగ్రామాన్ని భయంకరంగా భావిస్తున్నాను’ అని మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్‌ తరువాత తను భార్యను, గ్రామాన్ని, ఇంటిని, తోటి గ్రామస్తులను రక్షించుకోలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం ఈ దంపతులు ఒక సహాయక శిబిరంలో తలదాచుకుంటున్నారు. ఆ రోజున తుపాకులు తమ తలపై గురిపెట్టి బలవంతంగా దుస్తులు తొలగించారని, గుంపు ముందు నృత్యం చేయించారని బాధిత మహిళ తెలిపింది.

Spread the love