విలువైన ఉంగరం దొరికితే?

శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘భాగ్‌ సాలే’. నేహా సోలంకి నాయిక. ప్రణీత్‌ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్‌ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వేదాన్ష్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌ పై బిగ్‌ బెన్‌, సినీ వ్యాలీ మూవీస్‌ అసోసియేషన్‌తో అర్జున్‌ దాస్యన్‌, యష్‌ రంగినేని, కళ్యాణ్‌ సింగనమల నిర్మించారు. జూలై 7న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో కార్తికేయ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత అర్జున్‌ దాస్యన్‌ మాట్లాడుతూ, ‘శ్రీ సింహాకు పేరు తెచ్చే సినిమా అవుతుంది. సురేష్‌ డిస్ట్రిబ్యూషన్స్‌ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం’ అని అన్నారు.
‘మంచి ఫన్‌తో ఎంటర్‌టైనింగ్‌గా రెండు గంటల సమయం సరదాగా తెలియకుండా గడిచిపోయే సినిమా’ అని సంగీత దర్శకుడు కాలభైరవ తెలిపారు. దర్శకుడు ప్రణీత్‌ మాట్లాడుతూ, ‘ఇది పూర్తిగా హైదరాబాద్‌ బేస్డ్‌ మూవీ. మంచి ఇరానీ ఛారు లాంటి సినిమా మాది’ అని చెప్పారు. హీరో శ్రీ సింహా కోడూరి మాట్లాడుతూ, ‘విలువైన ఉంగరం దొరకడం వల్ల ఇందులో నా జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది’ అని తెలిపారు.

Spread the love