IIT Mandi: ఐఐటీ మండీ నుంచి ఐదు షార్ట్ టర్మ్ కోర్సులు.. యువతలో ఇంజనీరింగ్ స్కిల్స్ పెంచడమే లక్ష్యం..
IIT Mandi: యువతలో స్కిల్స్ పెంపొందించడానికి ఇటీవల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రత్యేక కోర్సులు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తద్వారా వారికి కెరీర్ అవకాశాలు మరింత మెరుగుపడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఐఐటీ మండీ చేరింది.
వర్క్‌ఫోర్స్‌లో యువతనుచేర్చుకునేందుకు చాలా సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ ట్రెండ్‌కు తగ్గట్లు అనేక స్పెషల్ కోర్సు(Special Courses) లను అందిస్తున్నాయి ప్రముఖ విద్యాసంస్థలు. యువతలో స్కిల్స్ పెంపొందించడానికి ఇటీవల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రత్యేక కోర్సులు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తద్వారా వారికి కెరీర్ అవకాశాలు మరింత మెరుగుపడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఐఐటీ మండీ (IIT Mandi) చేరింది. స్కిల్స్‌ కోసం విభిన్నమైన ఐదు షార్ట్‌టర్మ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం హిమాచల్‌ప్రదేశ్ కౌశల్ వికాస్ నిగమ్ (HPKVN) అనే సంస్థ సహకారం అందించనుంది.
* కోర్సుల వివరాలు
హ్యాండ్స్-ఆన్ ట్రైనింగ్ ఆఫ్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్; ఫైనైట్ ఎలిమెంట్ మోడలింగ్ ఆఫ్ ఇంజనీరింగ్; హ్యాండ్స్-ఆన్ కోర్స్ ఆన్ ఎంబెడెడ్ సిస్టమ్స్‌; మోడల్ ప్రిడిక్టివ్ కంట్రోల్ ఫర్ ఇండస్ట్రియల్ సిస్టమ్; హ్యాండ్స్-ఆన్ కోర్స్ ఆన్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ మ్యానుప్యాక్చర్.. వంటి ఐదు కోర్సులను ఐఐటీ మండీ ఆఫర్ చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఎవరైనా ఐఐటీ మండీ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రియల్ లైఫ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ పరిష్కాల కోసం అవసరమైన స్కిల్స్‌ను ఈ కోర్సుల ద్వారా పెంపొందించి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే తమ లక్ష్యమని ఐఐటీ మండీ పేర్కొంది.
* ఉచిత వసతి సదుపాయాలు
కోర్సుల వ్యవధి ఒక నెల మాత్రమే ఉంటుంది. రిజిస్ర్టేషన్‌కు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా ఎంపికైన వారికి ఉచిత ఆహారం, వసతి, బోధనా సామగ్రిని అందజేస్తుంది. ఐఐటీ మండీకి చెందిన సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (CCE) ఈ కోర్సులను పర్యవేక్షిస్తుంది.