పెంచిన వేతనాలను అమలు చేయాలి

సీఐటీయూ జిల్లా నాయకులు రుద్రకుమార్‌
నార్సింగి కమిషనర్‌ సత్యబాబుకు వినతి
నవతెలంగాణ-గండిపేట్‌
సీఎం కేసీఆర్‌ ప్రకటించిన ఆదేశాలను పాటిస్తూ మున్సిపల్‌ కార్మికులందరికీ పెంచిన వేతనాలను అమలు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు రుద్రకుమార్‌, మండల కన్వీనర్‌ ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవా రం సీఐటీయూ మండల శాఖ, మున్సిలర్‌ మున్సిపల్‌ వర్క ర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నార్సింగి కమిషనర్‌ సత్యబా బుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 1 నుంచి కార్మికులందరికీ వేయ్యి రూపాయాల జీతం పెంచుతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని గుర్తు చేశారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గం లోని మున్సిపాలిటీల్లో ఇది అమలు కావడం లేదన్నారు. ఈ విషయంను ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ ఏ మాత్రం పట్టించుకోవ డం లేదన్నారు. ప్రభుత్వ పరంగా జీవో వచ్చినా మున్సిపల్‌ అధికారులు పెంచిన వేతనాన్ని అమలు చేయడం లేదన్నా రు. జిల్లాలోని బాలాపూర్‌, బడంగ్‌పేట్‌, గ్రేటర్‌ హైదరాబా ద్‌లో అమలు చేస్తున్నారని తెలిపారు. కానీ శివారు మున్సిపాలిటీల్లో అమలు కావడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని నార్సింగి, బండ్లగూడ, మణికొండ మున్సిపాలిటీల్లోకి కార్మికులకు పెంచిన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ముండల కన్వీనర్‌ ప్రవీణ్‌కుమార్‌, మున్సిపల్‌ కార్మికుల యూనియన్‌ అధ్యక్షులు మహిపాల్‌, సభ్యులు జనార్థన్‌రెడ్డి, శ్రీనివాస్‌, వరప్రసాద్‌, రాజు, తదితరులు పాల్గొన్నారు.