భారత హాకీ వ‌ర‌ల్డ్ క‌ప్ స్టార్ అనుమానాస్ప‌ద మృతి..

నవతెలంగాణ-హైదరాబాద్ : భార‌త జూనియ‌ర్ హాకీ వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో రాజీవ్ మిశ్రా క‌న్నుమూశాడు. వార‌ణాసిలోని త‌న సొంత ఇంట్లో అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందాడు. రాజీవ్ రెండు మూడు రోజుల క్రిత‌మే మ‌ర‌ణించి ఉంటాడ‌ని స్థానికులు అంటున్నారు. 46 ఏళ్ల‌ రాజీవ్‌కు భార్య‌, ఇద్ద‌రు పిల్లలు ఉన్నారు. అత‌ను నివ‌సిస్తున్న ఇంటిలోంచి దుర్వాస‌న రావ‌డంతో ఇరుగుపొరుగు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. దాంతో, పోలీసులు అనుమానాస్ప‌ద మ‌ర‌ణంగా కేసు న‌మోదు చేశారు. రాజీవ్ మృతి ప‌ట్ల హాకీ ఇండియా అధ్య‌క్షుడు దిలీప్ ట‌ర్కీ సంతాపం తెలియ‌జేశాడు.