ఇండియన్‌ నేషనల్‌ ఆటోక్రాస్‌ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభం

– ఆపరేషన్‌ థియేటర్‌ కోసం రూ.7.5 కోట్ల నిధుల సేకరణ లక్ష్యం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు చికిత్స చేసేందుకు సిద్ధిపేట జిల్లా సత్యసాయి ఆస్పత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రోటరీ ఫౌండేషన్‌ రెండు లక్షల అమెరికన్‌ డాలర్ల గ్రాంటును ఆమోదించినట్టు రొటేరియన్‌ ఉదరు పిలానీ తెలిపారు. ఇందుకోసం స్థానికంగా రూ.7.5 కోట్లను సేకరణకు ఉద్దేశించిన ఇండియన్‌ నేషనల్‌ ఆటోక్రాస్‌ ఛాంపియన్‌ షిప్‌ను గచ్చిబౌలిలో రోటరీ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ ఎలక్ట్‌ రొటేరియన్‌ బుసిరెడ్డి శంకర్‌ రెడ్డి, ఆర్‌సీ లేక్‌ జిల్లా మొయినాబాద్‌ అధ్యక్షులు రొటేరియన్‌ పతంజలి ఉపద్రష్ట శనివారం ప్రారంభించారు. ఆదివారం జరిగే ఈవెంట్‌లో అగ్రశ్రేణి రేసర్లు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఔత్సాహిక పోటీదార్లు తమ కార్లతో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్టు వివరించారు.

Spread the love