కేరళలో అంతర్జాతీయ సైన్స్‌ ఫెస్టివల్‌

ఆసియాలోనే అతి పెద్ద సమావేశం
తిరువనంతపురం : కేరళలోని తిరువనంతపురంలో డిసెంబర్‌ నుంచి రెండు నెలల పాటు అంతర్జాతీయ సైన్స్‌ ఫెస్టివల్‌ను నిర్వహించబోతున్నారు. దీనిని ఆసియాలోనే అతి పెద్ద సైన్స్‌ ఫెస్టివల్‌గా భావిస్తున్నారు. సైన్స్‌ను అందరికీ చేరువ చేయడమే ఈ ఫెస్టివల్‌ ముఖ్యోద్దేశం. దీనిలో భాగంగా విద్యార్థులు, శాస్త్రవేత్తల కోసం సైన్స్‌ ఎగ్జిబిషన్‌, సైన్స్‌ కాంగ్రెస్‌లను నిర్వహిస్తారు. ఎగ్జిబిషన్‌లో మ్యూజియం, నౌకాదళానికి చెందిన హెచ్‌ఎంఎస్‌ బీగల్‌ నౌక ప్రతిమ ఉంటాయి. డార్విన్‌ పరిణామ సిద్ధాంతం స్ఫూర్తితో రూపొందించిన ఫెస్టివల్‌ లోగోను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆవిష్కరించారు. కేరళ రాష్ట్ర సైన్స్‌, టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్‌ కౌన్సిల్‌ (కేఎస్‌సీఎస్టీఈ), శాస్త్ర సాంకేతిక శాఖ, ఎఎంయూఎస్‌ఈయూఎం సంయుక్తంగా లైఫ్‌ సైన్స్‌ పార్కులోని
కేరళలో అంతర్జాతీయ సైన్స్‌ ఫెస్టివల్‌ 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తాయి. సైన్స్‌ ఫెస్టివల్‌కు సన్నాహకంగా 2016 నవంబర్‌లోనే అతి పెద్ద ర్యాలీ నిర్వహించారు. దీనికి పాఠశాలలు, కళాశాలల నుండి విశేష స్పందన లభించింది. అయితే కోవిడ్‌ కారణంగా ఫెస్టివల్‌ నిర్వహణలో జాప్యం జరిగింది. ఫెస్టివల్‌ కోసం గత కొంత కాలంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఫెస్టివల్‌ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కోట్ల రూపాయలు కేటాయించింది. రెండు నెలల పాటు జరిగే ఫెస్టివల్‌లో వివిధ అంశాలపై కూలంకషంగా చర్చలు జరుగుతాయి. దీనికి పది లక్షల మంది హాజరవుతారని అంచనా.

Spread the love