చొరబాటుదారుడు కాల్చివేత

శ్రీనగర్‌ : భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఒక పాకిస్థానీ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్‌) హతమార్చింది. భద్రతా సిబ్బంది హెచ్చరించినప్పటికీ, ఆ వ్యక్తి దూసుకొస్తుండటంతో కాల్పులు జరిపారు. జమ్ముకాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో సాంబ సెక్టర్లో ఈ సంఘటన గురువారం జరిగింది.
బీఎస్‌ఎఫ్‌ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, అంతర్జాతీయ సరిహద్దుల్లోని బీఓపీ (బోర్డర్‌ ఔట్‌ పోస్ట్‌) మంగు చక్‌ వద్ద గురువారం తెల్లవారుజామున 2.50 గంటలకు పాకిస్థాన్‌ వైపు నుంచి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా దూసుకొస్తుండాన్ని బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది గమనించారు. ఆ వ్యక్తిని హెచ్చరించినప్పటికీ, ఆ వ్యక్తి సరిహద్దు కంచె వైపు దూసుకొచ్చాడు. దీంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో సాంబ సెక్టర్‌లో బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సోదాలు నిర్వహించారు.

Spread the love