మంత్రి ఎర్రబెల్లికి ఇస్కాన్‌ ఆహ్వానం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇస్కాన్‌ అధ్వర్యంలో ఈ నెల 27న పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో నిర్వహించనున్న జగన్నాథ రథయాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఆ సంస్థ ప్రతినిధులు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావును ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో వారు ఆయన్ను కలిశారు. రథ యాత్రకు సంబంధించిన విషయాలను, ప్రాధాన్యతను వారు మంత్రికి వివరించారు. రథయాత్రలో పాల్గొనేందుకు ఎర్రబెల్లి అంగీకరించారని ఇస్కాన్‌ సంస్థ తెలిపింది.

Spread the love