జల సవ్వడికి వేలాయే..

– అలుగునుండి గలగల పారుతున్న వాటర్ ఫాల్స్..
– ఇకనుండి చూపరులకు కనువిందు..
నవతెలంగాణ -డిచ్ పల్లి
గత నెలన్నర రోజుల నుండి ఆశించిన మేరకు వర్షాలు లేక దిగులు చెందిన రైతులు, యువకులు, ప్రజలు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆహ్లాదాన్ని ఇచ్చే జల సవ్వడికు వేల రానే వచ్చేసింది.ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి లో ఉన్న శీలం జానకి బాయి పెద్ద చెరువు (సిర్నాపల్లి వాటర్ ఫాల్స్] జలపాతం గురువారం నుండి వర్షపు నీరు అలుగు పై నుండి గలగల పారడం మొదలైందని సర్పంచ్ తేలు విజయ్ కుమార్, ఎంపిటిసి శ్రీనివాస్ తెలిపారు. ఈ అద్భుతమైన సుందర దృశ్యాన్ని తినిపించడానికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వారికి అ సమయం రానే వచ్చేసింది. వర్షం పడిన వాటర్ ఫాల్స్ చూడడానికి రాష్ట్రంలోని ఎన్నో జిల్లాలు మండలాల నుండి తండోప తండాలుగా ప్రజలు వాహనాల్లో రాకపోకలు ఇక మొదలైనట్లేనని గ్రామస్తులు తెలిపారు.
Spread the love