మగువలకు అందాన్ని ఇచ్చేది ఆభరణం

– జెడ్పి చైర్ పర్సన్ రోజా శర్మ
– మలబార్ గోల్డ్.. డైమండ్స్ లో బంగారు ఆభరణాల కళాత్మక ప్రదర్శన
నవతెలంగాణ – సిద్దిపేట
మగువలకు అందాన్ని ఇచ్చేది ఆభరణమని, సిద్దిపేట ప్రజల కోసం అనేక ప్రాంతాల నుండి మంచి ఆభరణాలను తీసుకొచ్చి ప్రదర్శించడం మలబార్ గోల్డ్ డైమండ్స్ నిర్వాహకులను అభినందిస్తున్నట్లు జెడ్పి చైర్ పర్సన్ రోజా శర్మ అన్నారు. పట్టణంలోని మలబార్ గోల్డ్ షోరూం లో 4 రోజుల పాటు జరుగు ఆర్టిస్ట్రీ బ్రాండెడ్  జ్యువలరీ షో ను ప్రజాప్రతినిధురాలు చిట్టి మాధురి తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్దిపేటలో అన్ని రకాల షోరూములు వస్తున్నాయని, దీంతో సిద్దిపేట ప్రజలు హైదరాబాద్, బొంబాయి లాంటి ప్రాంతాలకు వెళ్ళనవసరం లేకుండా ఉందన్నారు. ఆర్టిస్టీ షోలో ప్రత్యేక ఆకర్షణలుగా మలబార్ గోల్డ్  డైమండ్స్ వారి బ్రాండుల సమాహారం “మైన్” ద్రువీకరించిన వజ్రాభరణాలు, వివాహం కోసం “ఎరా” అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ఠ శ్రేణి, “ప్రేష్యా” జాతిరత్నాభరణాల సముదాయం, “అధునాతన ఆణిముత్యాలు”  డిజైన్లతో ప్రకాశవంతమైన ఆభరణాలను ప్రదర్శనలో ఉన్నాయన్నారు. సిద్దిపేట ప్రజలు సందర్శించి , అవసరమంటే కొనుగోలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో షోరూం ప్రతినిధులు  ఇర్ఫాన్, శివ,  వాజిద్, మలబార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.