ఆరు మాసాలకు ఒకసారి జాబ్ మేళా: ఎమ్మెల్యే

నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్రానికి జిల్లా కేంద్రానికి పూర్తిగా మారుమూల ప్రాంతంలోని వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గం లో నిరుద్యోగ యువతీ యువకుల కోసం నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఆరు మాసాలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే తెలిపారు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పన కోసం గురువారం నాడు బిచ్కుంద మండల కేంద్రంలో 51 కంపెనీ యజమాన్యాల ద్వారా మేఘ జాబ్ మేళాను ఎమ్మెల్యే అనుమంతు సిండే ప్రారంభించారు ఈ జాబ్ మేళ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఉమ్మడి మద్నూర్ మండలం లోని మద్నూర్ డోంగ్లి మండలాల నుండి నిరుద్యోగ యువతీ యువకులు బిచ్కుందకు తరలి వెళ్లారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే హనుమంతు షిండే మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఉపాధి కల్పించేందుకు నియోజకవర్గంలోని ఏడు మండలాలైనా మద్నూర్ డోంగ్లి బిచ్కుంద జుక్కల్ పెద్ద కోడప్పుగల్ పిట్లం నిజాంసాగర్ ఈ మండలాల్లో జాబ్ మేళ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు బిచ్కుంద లో గురువారం నిర్వహించిన జాబ్ మేళాకు మద్నూర్ డోంగ్లి మండలాలతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు 51 కంపెనీల యజమానులు ఉపాధి కల్పన కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీపీలు జడ్పిటిసిలు సర్పంచులు ఎంపీటీసీలు బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

Spread the love