విజువల్‌ వండర్‌గా కంగువ

హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. ఈ చిత్ర టీజర్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్నాయి. బాలీవుడ్‌ కథానాయిక దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. చారిత్రక నేపథ్యంతో పాన్‌ వరల్డ్‌ మూవీగా మొత్తం పది భాషల్లో డైరెక్టర్‌ శివ దర్శకత్వంలో తెెరకెక్కుతున్న ఈ సినిమా త్రీడీ ఫార్మెట్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ టీజర్‌ని ప్రస్తుతం ఇంగ్లీష్‌, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ చేశారు. మరో నాలుగు భాషల్లో త్వరలోనే టీజర్‌ను తీసుకొస్తామని చిత్ర బృందం తెలిపింది.
రెండు నిమిషాల పాటు సాగిన ఈ టీజర్‌లో విజువల్‌ గ్రాండియర్‌, హై క్వాలిటీ ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌, మెస్మరైజ్‌ చేసే సూర్య స్క్రీన్‌ ప్రెజెన్స్‌ అందర్నీ ఆకట్టుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మరో ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాను ఒక విజువల్‌ వండర్‌గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేందుకు చిత్ర యూనిట్‌ శ్రమిస్తోంది. టాప్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీల ద్వారా వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్‌ ఫ్లాన్‌ చేస్తున్నారు.
ఈ చిత్రానికి ఎడిటర్‌ – నిశాద్‌ యూసుఫ్‌, యాక్షన్‌ – సుప్రీమ్‌ సుందర్‌, డైలాగ్స్‌ – మదన్‌ కార్కే, డైలాగ్స్‌ – ఆది నారాయణ, పాటలు – వివేక్‌, మదన్‌ కార్కే, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ – అను వర్థన్‌, దష్ట పిల్లై, కాస్ట్యూమ్స్‌ – రాజన్‌, కొరియోగ్రఫీ – శోభి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – ఏ జే రాజా, కో ప్రొడ్యూసర్‌ – నేహా జ్ఞానవేల్‌ రాజా, ప్రొడ్యూసర్స్‌ – కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌.

Spread the love