కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

నవతెలంగాణ-నవీపేట్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్టులకు నిరసనగా బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను గురువారం దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు వంశీ మోహన్ మాట్లాడుతూ.. బాట సింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలనకు వెళ్తున్న కిషన్ రెడ్డిని అరెస్టు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడమే కాక ప్రతిపక్షాల నోరు మూసేసే చర్యలకు పూనుకోవడం హేయమైన చర్య అని  అన్నారు. వెంటనే విడుదల చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బందెల ఆనంద్, వంశీ మోహన్, రామకృష్ణ, గణేష్, బాల గంగాధర్, బండారి శేఖర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.