రైతులను రాజు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్: ఎమ్మెల్యే జాజాల సురేందర్

నవతెలంగాణ- రామారెడ్డి
దేశంలో రైతును రాజు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని గురువారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని కన్నాపూర్ రైతు వేదికలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విద్యుత్ సరఫరా పై మాట్లాడిన విధానాన్ని ఖండిస్తూ రైతులతో, టిఆర్ఎస్ నాయకులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ…. 65 సంవత్సరాలు కాంగ్రెస్, బిజెపికి పరిపాలించే రైతులకు చేసింది ఏమీ లేదని, తెలంగాణ రాకముందు కాలిపోయిన మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు తప్ప రైతుకు మిగిలింది ఏమీ లేదని, తెలంగాణ ఏర్పాటు కోసం, అనేక ఉద్యమాలు చేసి, తెలంగాణ సాధించే వరకు వెనుకడుగు వేయలేదని, ఇక్కడ పాల్గొన్నవారు ప్రతి ఒక్కరు తెలంగాణ కోసం కొట్లాడిన వారేనని, తెలంగాణ వచ్చిన తర్వాత, కెసిఆర్ ఆధ్వర్యంలో రైతుబంధు, రైతు బీమా, మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగాయని, అన్నారు. తెలంగాణ రాకముందు మాచారెడ్డి మండలంలో వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి, వైస్ ఎంపీపీ ముత్తినేని రవీందర్రావు, సర్పంచ్ రాజనర్, రైతుబంధు అధ్యక్షులు నారాయణరెడ్డి, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్, గిద్ద ఎంపిటిసి ప్రవీణ్ గౌడ్, సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి, ఉప సర్పంచ్ అంజలి రెడ్డి, సర్పంచులు సంజీవ్, చందర్ నాయక్, గంగారం, నాయకులు రాజేందర్ గౌడ్, జంగం లింగం, పడిగల శ్రీనివాస్, పోతునూరి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.