బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన కిషన్ రెడ్డి..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యేలు చింతల ప్రభాకర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు ఉన్నారు. అంతకు ముందు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.