బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేపు బాధ్యతలు చేపట్టనున్న కిషన్ రెడ్డి

kishan-reddyనవతెలంగాణ – హైదరాబాద్
ఇటీవల తెలంగాణలో బీజేపీలో అధిష్ఠానం భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డిని నియమించింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ కిషన్‌ రెడ్డికి బాధ్యతలను అప్పగించింది. ఇదిలా ఉండగా.. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డి రేపు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఉదయం 11గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ సీనియర్‌ నేతలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు తరలిరానున్నారు.