రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు

– పలు జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వచ్చే ఐద్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. గురువారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షం పడే సూచనలున్నాయని పేర్కొన్నారు. పలు జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేశారు. ఆ జాబితాలో ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చెల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలున్నాయి. తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ నివేదిక ప్రకారం బుధవారం రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో 222 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ వర్షం కురిసింది. మెదక్‌ జిల్లా ఎల్దుర్తిలో అత్యధికంగా 3.3 సెంటీమీటర్ల వాన పడింది.

Spread the love