సాహితీవేత్త కేతు విశ్వనాథ్ రెడ్డి కన్నుమూత

నవతెలంగాణ – ఒంగోలు: కడపకు చెందిన ప్రముఖ తెలుగు కథా రచయిత, సాహితీవేత్త కేతు విశ్వనాథ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. విశ్వనాథ్‌ రెడ్డి రెండు రోజుల క్రితం ఒంగోలులోని ఆయన కుమార్తె ఇంటికి వెళ్లారు. అక్కడ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఒంగోలులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 5.30 గంటలకు గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Spread the love