రాజమండ్రిలో ప్రారంభమైన మహానాడు…

నవతెలంగాణ – రాజమండ్రి
రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా ప్రారంభమయింది. ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి, నివాళి అర్పించారు. పార్టీ జెండాను ఎగురవేసి మహానాడును ప్రారంభించారు. ప్రతినిధుల రిజిస్టర్ లో చంద్రబాబు సంతకం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 15 వేల మంది ప్రతినిధులు జిల్లాల వారీగా సంతకాలు చేస్తున్నారు. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన యువనేత నారా లోకేశ్ మహానాడుకు హాజరయ్యారు. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడు పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

Spread the love