30 ప్రభుత్వ స్కూల్స్ ను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

నవతెలంగాణ – హైదరాబాద్
సినీ పరిశ్రమలో ఉన్న పెద్ద కుటుంబాలలో మంచి వారి కుటుంబం కూడా ఒకటి. వీరి ఫ్యామిలీ తరచూ సేవాకార్యక్రమాలు చేస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుంటూ ఉంది. తాజాగా మంచు మోహన్ బాబు తనయురాలు మంచు లక్ష్మి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లా లో ఉన్న 30 ప్రభుత్వ పాఠశాలలను మంచు లక్ష్మి దత్తత తీసుకుంది. ఈ దత్తతలో భాగంగా ఏ విషయాలకు మంచు లక్ష్మి ఆర్ధికంగా పూర్తి సహాయాన్ని అందించనున్నారు అన్న విషయాలను నిన్న ఆ జిల్లా కలెక్షన్ క్రాంతి తో సమావేశమై తెలియచేయడం జరిగింది. ఈ స్కూల్స్ లో డిజిటల్ విద్య, కంప్యూటర్ క్లాస్ లు, మిగిలిన మౌలిక సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక మంచు లక్ష్మి ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదని తెలిసిందే.. ఇంతకు ముందు యాదాద్రి జిల్లాలో 50 స్కూల్స్ ను దత్తత తీసుకుంది. ఈమెను చూసి సమాజంలో డబ్బున్న పెద్ద మనుషులు ఇంకా మరెన్నో సేవలు చేయడానికి ముందుకు రావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

Spread the love