నవతెలంగాణ-హైదరాబాద్: మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. జాతుల మధ్య ఘర్షణలతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడం అనాగరికమన్నారు. దేశంలో అనాగరికత సాధారణంగా ఎలా మారిపోయిందో చెప్పడానికి ఈ బాధాకర ఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయన్నారు. ఈ భయానక హింసాకాండ, శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతినడాన్ని కేంద్ర ప్రభుత్వం మౌనంగా చూస్తోందని కేటీఆర్ ఆక్షేపించారు. మణిపుర్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే.. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎక్కడ ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు.