నవతెలంగాణ-హైదరాబాద్ : సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా నాలుగు రైళ్లను ఈనెల 24 నుంచి 30 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇందులో కాచిగూడ-నిజామాబాద్ (07596), నిజామాబాద్-కాచిగూడ (07593), హెచ్.ఎస్.నాందేడ్-నిజామాబాద్ (07854), నిజామాబాద్-హెచ్.ఎస్.నాందేడ్ (07853) రైళ్లున్నాయి. మరో రెండు రైళ్లను 24-30 తేదీల మధ్య పాక్షికంగా రద్దు చేసింది. దాండ్-నిజామాబాద్ (11409) రైలు దాండ్ నుంచి ముద్కేడ్ వరకే రాకపోకలు సాగిస్తుంది. అదేవిధంగా నిజామాబాద్-పంధర్‌పూర్ (01413) రైలు ముద్కేడ్ నుంచి పంధర్‌పూర్ మధ్యనే తిరుగుతుంది. కర్నూలు సిటీ-సికింద్రాబాద్ (17024) రైలు 25న నిర్ణీత సమయం కంటే 90 నిమిషాలు, గుంతకల్-బోధన్ (07671) రైలు ఈనెల 26, 27, 30 తేదీల్లో 120 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరుతాయి.