నవతెలంగాణ-హైదరాబాద్ : గత కొన్ని సెషన్లుగా లాభాలతో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 887 పాయింట్లు నష్టపోయి 66,684కి పడిపోయింది. నిఫ్టీ 234 పాయింట్లు కోల్పోయి 19,745కి దిగజారింది. టెక్, ఐటీ, ఫైనాన్స్ సూచీలు ఎక్కువగా నష్టపోయాయి.