ఎల్‌సాల్వడార్‌లో భారీ భూకంపం…

నవతెలంగాణ – సాన్‌ సాల్వడార్‌: లాటిన్‌ అమెరికా దేశమైన ఎల్‌ సాల్వడార్‌లో భారీ భూకంపం వచ్చింది. పసిఫిక్‌ మహాసముద్రం తీరంలోని ఎల్‌ ఎల్వడార్‌ ప్రాదేశిక జలాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత 6.5గా నమోదయిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. సముద్ర గర్భంలో 70 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని తెలిపింది. దేశ రాజధాని సాన్‌ సాల్విడార్‌కు సమీపంలోని సముద్ర తీర పట్టణమైన లా లిబర్టెడ్‌లో కూడా భూమి కంపించిందని అధికారులు తెలిపారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిళ్ల లేదని, సునామీ వచ్చే అవకాశం లేదని వెల్లడించారు. కాగా, పసిఫిక్‌ తీరంలో భూకంపం ప్రభావంతో నికరాగువా, హోండురస్‌, గ్వాటెమాలా, బ్రెజిల్‌లో కూడా స్వల్పంగా కదలికలు సంభవించాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీచేయలేదన్నారు.

Spread the love