బిఆర్ఎస్ లో భారీగా చేరికలు

నవ తెలంగాణ-ఆర్మూర్
నందిపేట్ మండల కేంద్రంలోని,పోచమ్మగల్లి యువకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ ఆర్మూర్ ఎమ్మెల్యే పియుసి చైర్మన్ నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీఅధ్యక్షులు జీవన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బిజెపి పార్టీ నుండి భారత రాష్ట్ర సమితి పార్టీలో ఆదివారం చేరడం జరిగింది. నందిపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.జనగామ దేవగౌడ్, చేతన్ గౌడ్, రాఘవ, నిషిత్ గౌడ్, అఖిలేష్, ముకేష్, విఘ్నేష్, మునిత్ గౌడ్, యోగేష్, దినేష్ గౌడ్, 30 మంది యువకులు పార్టీలో చేరడం జరిగింది. యువకులు పార్టీలో చేరడానికి కృషి చేసిన టౌన్ యూత్ ప్రెసిడెంట్ దినేష్ నీ అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు భాస్కర్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ హుస్సేన్, సీనియర్ నాయకులు ఉల్లి సుధాకర్ గౌడ్, హుస్నుద్దిన్, ఎంపీటీసీ బజరంగ్, దర్వాడి అశోక్, గంధం రాజశేఖర్, మంతెన శ్రీకాంత్, రోహిత్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Spread the love