ఎమ్మెల్యే నే కానీ.. సామాన్యులతో కలిసి ఇలా

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇలా నిలబడి సన్నిహితులతో మాట్లాడుతూ భోజనం చేస్తున్నది ఒక ఎమ్మెల్యే అంటే నమ్ముతారా?అందులోనూ అధికార పార్టీ ఎమ్మెల్యే పైగా! ఎందుకంటే ఆయనకో ప్రొటోకాల్, ప్రత్యేక ప్రతిపత్తి ఉంటాయి కాబట్టి. ఈ రోజుల్లో కొందరు పంచాయితీ సర్పంచ్ ల డాబూ దర్పం ప్రదర్శించే తీరు చూస్తుంటేనే ఆహా ఓహో అనేలా ఉంటాయి. మరి ఎమ్మెల్యే అంటే ఇంకా ఎంత గా ప్రదర్శిస్తారో మనకు తెలియంది ఏమీ కాదు. ఇంతకీ ఈయనెవరో తెలుసా? అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. ఈయన బుధవారం అశ్వారావుపేట ఆయిల్ ఫామ్ అదనపు ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభించిన అనంతరం ఆయిల్ఫెడ్ అధికారులు ఏర్పాటు చేసిన విందులో ఇలా నిలబడి సన్నిహితులతో నిలబడి భోజనం చేసారు. వాస్తవానికి అక్కడ ముఖ్య అతిధిలకు కూర్చుని తినడానికి ప్రత్యేక సౌకర్యం కల్పించారు. అందరిలో ఒకడిలా కలిసే తింటానని ఇలా క్యూలో భోజనం వడ్డించుకొని నిలబడి సామాన్యుడి వలె భోజనం చేశారు. ఇది అక్కడున్న కొందరు అభిమానులు క్లిక్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో “సామాన్య ఎమ్మెల్యే” అంటూ అభిమాన శ్రేణులు వైరల్ చేస్తున్నారు.
Spread the love