24 గంటల సమయం ఇస్తున్నా..అర్వింద్‌కు ఎమ్మెల్సీ కవిత సవాల్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్‌ విసిరారు. ఎంపీ అర్వింద్ కు  24 గంటల సమయం ఇస్తున్నానని తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని కవిత సవాల్ విసిరారు. ఆరోపణలను నిరూపించకపోతే ఆయన ముక్కు నేలకు రాయాలని డిమాండ్‌ చేశారు. ఎంపీగా ఉన్నప్పుడు 2 కేంద్రీయ విద్యాలయాలు తెచ్చాను. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే స్పైస్‌ బోర్డు తెచ్చినా.. అర్వింద్‌ తెచ్చానని చెబుతున్నారు. ఇప్పుడు నా భర్తపై ఆరోపణలు చేస్తున్నారు. ఆయన పేరు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? నేను, నాన్న, అన్న, రాజకీయాల్లో ఉన్నాం అని సహించాం. నా భర్త పేరు వాడటం సరైన పద్ధతి కాదు అని కవిత అన్నారు.

Spread the love