అన్నారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన వారికే కేటాయించాలి: మోహన్ రెడ్డి

నవ తెలంగాణ- రామారెడ్డి
అన్నారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో, గ్రామంలోని మరి కొంతమంది నిరుపేదలకు అందలేవని, అధికారులు వెంటనే స్పందించి, గ్రామంలోని నిరుపేదలైన, అర్హులైన వారికే, తిరిగి పంపిణీ చేయాలని గురువారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో, అన్నారం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలతో కలిసి తాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రభుత్వం వెంటనే నిరుపేదలను గుర్తించి, వారికి ముందు వరసలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించాలని, లేదంటే పేదల కోసం ఉద్యమం తప్పదని, పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి కొట్లాడుతుందని అన్నారు.కార్యక్రమంలో నాయకులు గీరెడ్డి మహేందర్ రెడ్డి,అన్నారం గ్రామస్తులు పాల్గొన్నారు.