
విద్యుత్ సబ్ స్టేషన్లలో కనీస సౌకర్యాలు కూడా లేవని, సిబ్బందికి సరైన సమయానికి వేతనాలు కూడా ఇవ్వటం లేదని శుక్రవారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఆరోపించారు. మండలంలోని పోసానిపేట్, రామారెడ్డి విద్యుత్ సబ్ స్టేషన్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులకు ఎక్కడ కూడా 24 గంటల విద్యుత్ సరఫరా చేయటం లేదని, 12 గంటల విద్యుత్ మాత్రమే సరఫరా చేయగా, రేవంత్ రెడ్డి దెబ్బతో, 18 నుంచి 20 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారని, సబ్ స్టేషన్ లో లాకు బుక్కులే సాక్షమని అన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ లో సిబ్బందికి కనీస సౌకర్యాలు లేవని, సబ్ స్టేషన్ గేటును కూడా మరమ్మతు చేయలేని ప్రభుత్వం, గ్లౌజులు, బూట్లు కూడా సరపర చేయకపోవడం, ట్రిప్పు బెల్ లేకపోవడంతో సబ్ స్టేషన్ లో సిబ్బందికి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, సరిపడే సిబ్బందిని కూడా కేటాయించకపోవడంతో, గ్రామాల్లో పని చేసే విద్యుత్ సిబ్బంది, సబ్ స్టేషన్ లో డ్యూటీలు చేయడం ఏంటని ప్రశ్నించారు. గ్రామాల్లో పనిచేసే విద్యుత్ సిబ్బంది లేక, ప్రైవేట్ వారిని ఆశ్రయించి, మరమ్మతులు చేయించుకోవడంతో రైతుల జేబులోకు చిల్లు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నా రైతు రాజ్యం అని గొప్పలు చెప్పుకునే బి ఆర్ ఎస్ నాయకులారా, వీటికి సమాధానం చెప్పండి అని సవాల్ విసిరారు. కార్యక్రమంలో పోసానిపేట సర్పంచ్, గిరి రెడ్డి మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.