Razr 40 అల్ట్రా మరియు Razr 40ని ఆవిష్కరించిన మోటరోలా

నవతెలంగాణ- హైదరాబాద్
– కేవలం రూ.59,999 నమ్మశక్యం కాని ధరతో ప్రారంభమయ్యే అత్యంత సన్నని
, గ్యాప్ లెస్ మరియు
దాదాపు క్రీజ్‌లెస్ ఫ్లిప్ ఫోన్‌లతో భారతీయ స్మార్ట్‌ ఫోన్ పరిశ్రమ తీరును మలుపు తిప్పింది
మోటరోలా razr 40 అల్ట్రా 144Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లిప్ ఫోన్లలో ప్రపంచంలోనే అతి పెద్ద, వేగవంతమైన, అత్యధిక రిజల్యూషన్ రిజల్యూషన్ 3.6” ఎక్స్‌ టర్నల్ డిస్‌ప్లేతో వస్తుంది.
– మోటరోలా కొత్త razr40 కుటుంబంతో రీడిజైన్ చేయబడిన టియర్‌డ్రాప్ మూవబుల్ జాయింట్లను పరిచయం చేసింది. ఫలితంగా రెండు రేజర్ ఫోన్లు కూడా వాటిని మడతపెట్టినప్పుడు ప్రపంచంలోనే అత్యంత సన్నని, ఖాళీలు లేని ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్‌లుగా మారాయి.
– మోటరోలా razr 40 అల్ట్రా మరియు razr 40 పరిశ్రమ యొక్క వేగవంతమైన రిఫ్రెష్ రేట్ 165Hzతో దాదాపు ముడతలు లేని 6.9″ మెయిన్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి.
– razr 40 అల్ట్రా, razr 40 రెండూ పునర్నిర్వచించే ఫ్లెక్స్ వ్యూ సాంకేతికతతో వస్తాయి, ఇంటరాక్ట్ అయ్యేందుకు, కాప్చర్ చేసేందుకు, క్రియేట్ చేసేందుకు కొత్త మార్గాలను అందిస్తాయి
– మోటరోలా razr 40 అల్ట్రా, razr 40 వరుసగా స్నాప్ డ్రాగన్ 8+ Gen 1, స్నాప్ డ్రాగన్ 7 Gen 1 ద్వారా శక్తిని పొందుతున్నాయి.
– ఈ అద్భుతమైన పరికరాల ధరలు razr 40 అల్ట్రా రూ. 89,999,  razr 40 వెల రూ. 59,999.
– వినియోగదారులు రూ. 7,000 తక్షణ తగ్గింపు/క్యాష్‌బ్యాక్ ను ఉపయోగించుకోవడం పరికరాల ప్రభావవంత మైన ధరను రూ. 82,999 మరియు 54,999గా చేస్తుంది.
– ఈ ఉపకరణాలను జూలై 3నుండి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. 15 జూలై నుండి అమెజాన్, Motorola.in, రిలయన్స్ డిజిటల్ మరియు ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో విక్రయించబడుతాయి.
– మోటరోలా  ఈ ఆవిష్కారంతో తమ ప్రచారకర్తగాగా కృతి సనన్‌ని ప్రకటించింది.
భారతదేశపు అత్యుత్తమ 5G స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్, ఫ్లిప్ ఫోన్‌ల మార్గదర్శి అయిన మోటరోలా తన ఫ్లాగ్‌షిప్ రేజర్ స్మార్ట్‌ ఫోన్‌ల సిరీస్‌లో సరికొత్త జోడింపులు మోటోరోలా రేజర్ 40 అల్ట్రా, రేజర్ 40 ఆవిష్కరణతో ఈరోజు మళ్లీ భారతీయ స్మార్ట్‌ ఫోన్ మార్కెట్‌ లో  సంచలనం కలిగించింది. ఈ ఆవిష్కరణ ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్‌ల తీరు తెన్నులను ఫ్లిప్ చేయడానికి అత్యాధునిక సాంకేతికత, స్టైల్-డ్రైవెన్ సెల్ఫ్ ఎక్స్‌ ప్రెషన్‌లతో కూడిన ఐకానిక్ రేజర్‌ను తిరిగి తీసుకువస్తుంది. ఈ కొత్త కుటుంబంలోని ప్రతి ఫీచర్ ప్రత్యేకించి నిలబడాలనుకునే, ఆధునిక ఫ్లిప్ ఫోన్ ఉత్తమ సంస్కరణను కోరుకునే ఆధునిక వినియోగదారుల అవసరాలను తీర్చడానికి జాగ్రత్తగా రూపొందించబడింది. మోటరోలా ఈ రోజు నగరంలో జరిగిన లాంచ్ ఈవెంట్‌లో భారతదేశపు ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్‌ను తన కొత్త ప్రచారకర్తగా ప్రకటించింది  ప్యాక్‌లో ముందంజలో ఉన్నది razr 40 అల్ట్రా. ఇది  ఫ్లిప్ క్లోజ్ చేసిన సమయంలో యావత్ పరిశ్రమలోనే  చాలా సన్నని ఫ్లిప్ స్మార్ట్‌ ఫోన్. శక్తివంతమైన స్నాప్ డ్రాగన్® 8+ Gen 1 మొబైల్ ప్లాట్‌ఫామ్, సమర్థవంతమైన బ్యాటరీ, ఫ్లిప్ ఫోన్‌లో అతిపెద్ద  ఎక్స్ టర్నల్ డిస్‌ప్లే.  ఈ నమ్మశక్యం కాని  అద్భుతమైన  ఎక్స్ టర్నల్ డిస్‌ప్లే ఆశ్చర్యపరిచే 3.6” పోలెడ్ స్క్రీ న్‌తో వస్తుంది.  ఇది మూసివేయబడినప్పుడు కూడా బహుళ యాప్‌లు, ఫంక్షన్‌లను పూర్తిగా సపోర్ట్ చేయగలదు. కా బట్టి వినియోగదారులు ఒక్క చూపులో మరిన్నింటినో వీక్షించవచ్చు. అత్యంత ముఖ్యమైన కంటెంట్‌ని యాక్సెస్ చేయ వచ్చు. వినియోగదారులు సందేశాలకు స్పందించవచ్చు, సెల్ఫీ తీసుకోవచ్చు, డైరెక్షన్స్ పొందవచ్చు, గేమ్‌లు ఆడ వచ్చు, Spotifyలో సంగీతాన్ని వినవచ్చు. ఈ పెద్ద ఎక్స్ టర్నల్ డిస్‌ప్లే లో యూట్యూబ్ ని వీక్షించి ఆనందించ వ చ్చు. అంతేకాకుండా, ఈ ఎక్స్ టర్నల్ డిస్‌ప్లే 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో సున్నితంగా ఉంటుంది. యాప్‌లు,  స్క్రోలింగ్, వెబ్‌సైట్‌ల మధ్య మారడాన్ని తిరుగులేని విధంగా చేస్తుంది.   ఈ ఎక్స్‌ టర్నల్ డిస్‌ప్లే 1100నిట్‌ల గరిష్ట ప్రకాశంతో వస్తుంది కాబట్టి అవుట్‌డోర్‌లో కూడా స్పష్టమైన స్క్రీన్ విజిబిలిటీ ని కలిగి ఉంటుంది. అలాగే, ఈ డిస్‌ప్లే కార్నింగ్® గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది. ఇది సాధారణ వినియో గానికి మన్నికను అందిస్తుంది. అంతేకాకుండా, ఎక్స్ టర్నల్ డిస్‌ప్లే దీని తరగతిలో అత్యధిక రిజల్యూషన్‌ను కలిగి ఉం టుంది. 10బిట్ మరియు 100% DCI-P3 ఫీచర్‌ల ద్వారా ఒక బిలియన్ షేడ్స్ ట్రూ-టు-లైఫ్ రంగులతో ఇది వీక్షణ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పెద్ద ఎక్స్‌ టర్నల్ డిస్‌ప్లే కంటెంట్ క్రియేషన్ నుండి మేకప్ అప్లయ్ చేయడం లేదా మీరు సెల్ఫీ తీసుకునే ముందు త్వరగా పరిశీలించడం దాకా వినియోగదారుల కోసం అనేక రకాల వినియోగ సంద ర్భాలను అందిస్తుంది. అంతేకాదు, మోటోరోలా razr 40 అల్ట్రా స్మార్ట్‌ ఫోన్ ను తెరిచినప్పుడు ఇది దాదాపు క్రీజ్‌లెస్, అల్ట్రా-స్మూత్ డిస్‌ప్లేను అందిస్తుంది. ఇది 6.9″ pOLED స్క్రీన్ అత్యధిక స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 165Hz మరియు 1400nits గరిష్ట ప్రకాశంతో పూర్తిగా తెరిచినప్పుడు కూడా స్మార్ట్‌ ఫోన్ అనుభవం వినియోగదారులకు మరింత మెరుగ్గా ఉండేలా చేస్తుంది. మోటొ రోలా razr40, 144Hz వద్ద రిఫ్రెష్ రేట్ పీక్స్‌ తో సారూప్య డిస్‌ప్లే కాన్ఫిగరేషన్‌తో వస్తుంది, ఇది దీన్ని చాలా మృదువైనదిగా కూడా చేస్తుంది.
డిజైన్ పరంగా మోటొరోలా ఆధునిక అనంతమైన అనువైన డిజైన్‌లో నోస్టాల్జియా ఐకానిక్ భాగాన్ని అందిస్తోంది. razr 40 Ultra ఎగువ, దిగువ అంచులు తిరుగులేని విధంగా కలుసుకునేలా పూర్తిగా సగానికి మడవబడుతుంది.  అత్యంత స న్నని, సొగసైన రూపాన్ని సంపూర్ణంగా అందిస్తుంది. చాలా ఇతర ఫ్లిప్ ఫోన్‌ల వలె కాకుండా, razr 40 అల్ట్రా, దాని పునః రూపకల్పన చేయబడిన టియర్‌డ్రాప్ మూవబుల్ జాయింట్స్ కారణంగా స్క్రీన్‌పై ముడతలేవీ పడవు. అంతే గాకుండా ఇది పరిశ్రమలోనే మొట్టమొదటి డ్యూయల్ ఆక్సిస్ ట్రాకింగ్‌తో కూడా వస్తుంది. ఇది పరికరం  పరిమాణాన్ని తగ్గిస్తుంది. తద్వారా  రెండు రేజర్ ఫోన్‌ లను కూడా  వాటిని ఫ్లిప్ చేసినప్పుడు, పరిశ్రమలో ప్రపంచంలోనే అత్యంత స్లిమ్మెస్ట్ ఫ్లిప్ప బుల్ ఫోన్‌లుగా చేశాయి.  razr 40 అల్ట్రా, razr 40 ఫీచర్ల ఐకానిక్ డిజైన్ వెనుకవైపు ప్రీమియం వెగాన్ లెదర్ ఎంపికతో కూడిన మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. ఇది పట్టుకోవడాన్నిసులభం చేస్తుంది, తాకడానికి మృదువుగా ఉంటుంది. స్మార్ట్‌ ఫోన్ అనుభవాన్ని పునర్నిర్వచిస్తూ, razr 40 అల్ట్రా,  razr 40 ఫ్లెక్స్ వ్యూ టెక్నాలజీతో వస్తాయి. పరస్పరం ఇం టరాక్ట్ అయ్యేందుకు, కాప్చర్ అయ్యేందుకు, క్రియేట్ చేసేందుకు ఈ టెక్నాలజీ కొత్త మార్గాలను అందిస్తుంది. కంటెంట్ చూసేందుకు, స్నేహితులతో వీడియో చాట్ చేసేందుకు, మరిన్నింటిని వీక్షించడానికి వినియోగదారులు సులభంగా పరికరాన్ని అటూ ఇటూ తిప్పవచ్చు. ఈ ఫోన్ ను నిలబెట్టినప్పుడు, సైన్ క్యాప్చర్, ఆటో-స్మైల్ క్యాప్చర్‌ని ఉపయోగించి పర్ఫెక్ట్ షాట్‌ను ఫ్రేమ్ చేయడానికి, పర్ఫెక్ట్ భంగిమను క్యాప్చర్ చేయడానికి వినియోగదారులకు వీలు కల్పిస్తుంది. ఈ పరికరం హై-ఎండ్ స్మార్ట్‌ ఫోన్ ఫీచర్లతో నిండి ఉంటుంది కాబట్టి ఈ పరికరం నలుగురిలో ప్రత్యేకంగా నిలబడటానికి ఇష్టపడే ట్రెండ్‌సెట్టర్‌లు, టేస్ట్‌ మేకర్‌లకు అనువైనది. అంతేగాకుండా, డిస్‌కనెక్ట్ అయి పరికరంపై నియంత్రణను తిరిగి తీసుకోవాలనుకునే  డిజిటల్ మినిమలిస్ట్‌ లకు కూడా ఎంతో అనువైంది. మోటరోలా Razr 40 అల్ట్రా అత్యంత సున్నితమైన లైటింగ్ పరిస్థితుల్లో కూడా వేగవంతమైన, మరింత కచ్చితమైన పని తీరు కోసం Instant Dual Pixel PDAFని ఉపయోగించి శక్తివంతమైన 12MP ప్రధాన కెమెరా సెన్సార్‌తో వస్తుంది. అను కోని వణుకులను తొలగించడానికి, అందమైన సాఫ్ట్-ఫోకస్ నేపథ్యాలతో చిత్రాలను రూపొందించడానికి OISతో విస్తృత f/1.5 అపెర్చర్ లెన్స్  అసాధారణ కలయికను కలిగి ఉంటుది. ఇది ఎల్లప్పుడూ ప్రయాణంలో ఉండే,  దోషరహిత చిత్రా లను క్యాప్చర్ చేయాలనుకునే, షేర్ చేయడానికి ఇష్టపడే కంటెంట్ సృష్టికర్తలకు కచ్చితంగా సరిపోతుంది. razr40 అల్ట్రా అనేది వీడియో కోసం నైట్ విజన్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది, ఇది తక్కువ-కాంతి వాతావరణంలో షూటింగ్ చేసే టప్పుడు మరింత డిటేల్ గా, మెరుగైన స్పష్టత, మరింత కచ్చితమైన రంగుతో ప్రకాశవంతమైన ఫుటేజీని క్యాప్చర్ చే స్తుంది.కెమెరాలను పరిపూర్ణం చేసేలా  13MP అల్ట్రావైడ్ + మాక్రో విజన్ లెన్స్ ఉంటాయి. ప్రామాణిక లెన్స్ కంటే ఫ్రేమ్‌లో 3x ఎక్కువ వైడ్ యాంగిల్ షాట్‌లకు ఇవి వీలు కల్పిస్తాయి.  వినియోగదారులు ఓపెన్ razr 40 అల్ట్రాను ఫ్లిప్ ఓపెన్ చేసి సె ల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32MP ఫ్రంట్ కెమెరాను కూడా ఉపయోగించవచ్చు లేదా సరైన సెల్ఫీ కోసం ఫోన్‌ను ఐడి యల్ వ్యూ లో ఫోల్డ్ చేయడం ద్వారా వారి చేతులను ఫ్రీగా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా, తొందరగా అలంకరించు కు నేందుకు లేదా ప్రత్యక్ష ప్రసారం కోసం వినియోగదారులు అధిక-నాణ్యత కెమెరా, భారీ డిస్ ప్లేను అద్దంలా ఉపయోగిం చుకోవచ్చు. అదేవిధంగా, ఇప్పటి వరకూ మోటరోలా ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్‌లలో దేనిలోనూ అందించని ఫీచర్  అత్యధిక రిజల్యూషన్ సెన్సార్‌ను razr 40   కలిగి ఉంది. ఈ పరికరం OISతో 64MP ప్రధాన కెమెరా, వెనుకవైపు 13MP అల్ట్రావైడ్ + మాక్రో విజన్ లెన్స్, ఉత్కంఠభరితమైన చిత్రాలను తీసేందుకు, అధిక-నాణ్యత వీడియో కాల్‌లను చేయడానికి ముం దు భాగంలో 32 MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫీచర్లకు తోడుగా, మరెంతో శక్తివంతమైంది స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్. ఇది అధునాతన ఏఐ, వేగవంతమైన రిఫ్రెష్ రేట్లు, 5G కనెక్షన్‌లతో వస్తుంది. మోటొరోలా razr 40 4nm ప్లాట్‌ఫామ్ ఆధారంగా స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 ద్వారా శక్తివంతమైనది. మల్టీ-మీడియా విషయానికి వస్తే, razr 40 అల్ట్రా అద్భుతమైన ప్రదర్శనకు మించి ఉంటుంది. ఇది మెరు గైన శ్రవణ అనుభూతి కోసం డాల్బీ అట్మోస్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇప్పుడు, వినియోగదారులు అసాధారణమైన దృశ్య వివరాలను ఆస్వాదించడమే కాకుండా మల్టీ-డైమెన్షనల్ సౌండ్‌ను కూడా అనుభూతి చెందగలరు. ఇది మరింత స్పష్టత, డిటేల్, గాఢతను అందిస్తుంది. మోటో ద్వారా కొత్త స్పేషియల్ సౌండ్‌తో కలిపి, ధ్వనిని మరింత లీనమయ్యేలా అనుభూతి చెందేలా చేస్తుంది. వినియోగదారు సంగీతం వింటున్నా లేదా వారికి ఇష్టమైన సినిమా చూస్తున్నా వారి చు ట్టూ పరిసరాలను వాటి శబ్దంతో నింపుతుంది. బ్యాటరీకి సంబంధించి, razr 40 ultra అనేది అల్ట్రా ఫాస్ట్  33W  టర్బో ప వర్ ఛార్జర్ తో బాక్స్ లోనే వస్తుంది.   దీర్ఘకాలం నిలిచే 3800mAH  బ్యాటరీపై వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది మునుపటి తరం రేజర్ కంటే పెద్దది. మోటార్‌లా razr 40 భారీ 4200mAH బ్యాటరీతో వస్తుంది. ఈ ఆవిష్కరణపై మోటరోలా ఆసియా పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, శ్రీ ప్రశాంత్ మణి మాట్లాడుతూ, “మోటరోలా సాంకేతిక త, ఆవిష్కరణలలో అగ్రగామిగా ఉంది. ఐకానిక్ రేజర్  వారసత్వానికి రెండు సరికొత్త జోడింపులను ప్రారంభించడం పట్ల మేం గర్విస్తున్నాం. మార్కెట్‌ లో సంచలనం కలిగించడం, ప్రతి ఒక్క ఉత్పాదనతో ప్రమాణాలను  పెంచడం చేస్తున్నాం. ఈ అత్యాధునిక పరికరాలు సాంకేతికత సరిహద్దులను నెడుతుంటాయి. అసాధారణమైన డిజైన్, విశేషమైన పనితీరు,  అసమానమైన వినియోగదారు అనుభవాన్ని ఒకచోట చేర్చడం వంటి మా అన్వేషణను ప్రతిబింబిస్తాయి. రేజర్ 40 అ ల్ట్రా, రేజర్ 40 అనేవి ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్‌ల భవిష్యత్తును రూపొందిస్తాయి. మా విలువైన కస్టమర్ల అంచనాలను అధిగ మిస్తాయి’’ అని అన్నారు. ఈ ఉత్పాదన లభ్యతపై అమెజాన్ ఇండియా వైర్లెస్ అండ్ హోమ్ ఎంటర్ టెయిన్ మెంట్ డైరెక్టర్ శ్రీ రంజిత్ బాబు మాట్లా డుతూ, ‘‘అమెజాన్ లో మేం ఎల్లప్పుడూ కొనుగోలుదారులకే మొదటి ప్రాధాన్యం ఇస్తాం. మా కొనుగోలుదారుల అవసరా లను అర్థం చేసుకునేందుకు, వారి ఆకాంక్షలను తీర్చేందుకు ప్రయత్నిస్తాం. వారి అనుభూతిని మెరగుపరిచేందుకు మేం నిరంతరం ప్రయత్నిస్తుంటాం. ఈ ఆశయాన్ని సాధించేందుకు విస్తృత్ స్థాయి అధిక నాణ్యమైన ఉత్పాదనలను అందించడ మే కీలకమని మేం విశ్వసిస్తాం. నేడు రేజర్ 40 సిరీస్ తో, ఈ దిశలో మేం మరో అడుగు ముందుకేశాం. మోటరోలా రేజర్ 40 మరియు 40 అల్ట్రా లను ప్రైమ్ డే నాడు ఆవిష్కరించేందుకు మేం గర్విస్తున్నాం. మా ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెలెక్షన్ కు ఈ ఉద్వేగభరిత జోడిపుతో కొనుగోలుదారులకు ఆనందాన్ని అందించేందుకు చూస్తున్నాం’’ అని అన్నారు. మోటొరోలా కొత్త razr 40 అల్ట్రాకు బోల్డ్ కలర్ ఆప్షన్‌లను తీసుకువస్తోంది ఇందులో ప్రీమియం వేగన్ లెదర్ డిజైన్‌లో పాం టోన్® కలర్ ఆఫ్ ది ఇయర్ 2023, మోటొరాలా పరికరాలకు ప్రత్యేకమైన షేడ్ అయిన వివా మెజెంటా, వాటితో పాటుగా మ్యాట్ ఫినిషింగ్ గ్లాస్‌తో ఇన్ఫినిట్ బ్లాక్ విత్ మాట్ ఫినిష్ గ్లాస్ బాడీ ఉన్నాయి. మోటోరోలా రేజర్ 40, ప్రీమియం వేగన్ లెదర్ ఫినిషింగ్ లో మూడు అధునాతన రంగులతో వస్తుంది, అవి: సేజ్ గ్రీన్, కాంటెంపరరీ గ్రీన్ టోన్, వెనిలా క్రీమ్,  వైట్‌క్లాసిక్ మరియు మార్మిక పర్పుల్ షేడ్ తో సమ్మర్ లిలక్ వీటిలో ఉన్నాయి. రెండు పరికరాలు కూడా ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతాయి. 3 OS అప్‌గ్రేడ్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌ల వాగ్దా నంతో వస్తాయి. అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగతీకరణ అందుబాటులో ఉంటుంది. సాధారణ సంజ్ఞలు, అనుకూల వినోద సెట్టింగ్‌లు వంటి  సిగ్నేచర్ మోటొరోలా అనుభవాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా, razr 40 అల్ట్రా, razr 40 థింక్‌షీల్డ్, మోటో సెక్యూర్, మోటో కీ సేఫ్‌తో సహా విస్తృతమైన భద్రతా ఫీచర్‌లను అందిస్తాయి.
లభ్యత & ధర
మోటరోలా razr40 అల్ట్రా ప్రారంభ ధర రూ. 89,999/- వద్ద అందుబాటులో ఉంటుంది, మోటరోలా razr40 ప్రారంభ ధర రూ. 59,999/- వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లు 15 జూలై 2023, మధ్యాహ్నం 12 గంటల నుండి Amazon, Motorola.in, Reliance Digital మరియు ఇతర ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో విక్రయించబడతాయి. రెండు స్మార్ట్‌ ఫోన్‌లు 15 జూలై 2023 నుండి ప్రారంభమయ్యే అమెజాన్ స్పెషల్‌లలో ప్రైమ్ డేలో భాగంగా ఉన్నాయి.

Spread the love