అంకాపూర్ లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎంపీ..

నవతెలంగాణ- ఆర్మూర్
బిజెపి పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నిర్వహిస్తున్నటువంటి ఇంటింటికి మోడీ కార్యక్రమంలో భాగంగా శనివారం పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ మండలంలోని అంకాపూర్ లోని లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించినారు ..ఆశ్రమ వ్యవస్థాపకులు గడ్డం పైపుల రాజారెడ్డి కలిసి వారికి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, మోడీ గారి నిస్వార్ధంగా చేస్తున్నటువంటి సేవలను తెలియజేసి, వారిని సన్మానించి “మోదీ 20 ఏళ్లు స్వప్నించాడు సాధించాడు” ,”తొమ్మిది సంవత్సరాల సేవా, సుపరిపాలన, పేదల సంక్షేమం” అనే పుస్తకాలను రాజారెడ్డి గారికి ఇవ్వడమైనది. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ వృద్ధులను పలకరించి వారి బాగోగులు తెలుసుకొని మీ యొక్క ఆశీర్వాదం నరేంద్ర మోడీ గారిపై ఉండాలని, రాబోయే కాలంలో మరోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఎన్నికైయ్యే విధంగా మీరందరి ఆశీర్వాదం ఉండాలని, మీరందరు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులను కోరడమైనది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love