నాన్నే … నా ప్రేరణ: రాహుల్ గాంధీ

నవతెలంగాణ ఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 32వ వర్థంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఆయన కుమారుడు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీట్విటర్‌ వేదికగా భావోద్వేగ పోస్టు చేశారు. ‘‘నాన్నా.. ఒక ప్రేరణ రూపంలో, జ్ఞాపకాలుగా మీరు సదా నాతోనే ఉన్నారు’’ అని పేర్కొన్నారు. దీంతోపాటు రాజీవ్‌ జ్ఞాపకాలను గుర్తు చేసే ఓ వీడియోను కూడా ఆయన జత చేశారు. ఆయన ఆదివారం ఉదయం తన సోదరి ప్రియాంకాగాంధీ వాద్రా తో కలిసి రాజీవ్‌ గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో రాజీవ్‌ గాంధీకి నివాళి అర్పించారు.  1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఉగ్ర సంస్థ ఎల్‌టీటీఈ బృందం చేసిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్‌ కన్నుమూశారు.

Spread the love