రిజిస్ట్రేషన్‌ లేకున్నా.. నెంబర్‌ ప్లేట్లు లేకున్నా అంతే సంగతులు

నవతెలంగాణ-సిటీబ్యూరో
యజమానులపై కఠిన చర్యలు తప్పవు
రాచకోండ కమిషనరేట్‌ పరధిలో రంగంలోకి ట్రాఫిక్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు

కొందరు యువకులు ట్రాఫిక్‌ నిబంధలను మనకు వర్తించవనే తీరులో రోడ్లుపై వాహనాలను అడ్డదిడ్డంగా నడిపిస్తారు. చేతిలో రేసింగ్‌ ఉంది కదా అని హైస్పీడ్‌తో దూసుకెళ్తారు. మరికొందరు ట్రాఫిక్‌ సిగల్స్‌ను సైతం లెక్కచేయడం లేదు. రాంగ్‌ రూట్లో దూసుకెళ్తూ పోలీసులు పట్టుకున్నప్పుడు చూద్దాంలే అంటూ నిర్ణక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంకొందరు నెంబర్‌ ప్లేట్‌ పెట్టు కోరు, ఉన్న నెంబర్‌ ప్లేట్‌పై రంగులు వేయడం, నెంబర్‌ కనిపిం చకుండా చేయడం లాంటివి చేస్తారు. మరికొందరు పీకలదాకా మద్యం సేవించి వాహనాలతో రోడ్లుపైకి వస్తున్నారు. కొన్ని వాహ నాలకు రిజిస్ట్రేషన్‌ సైతం ఉండడం లేదు. ఇలాంటి వాహనాల మూలంగా నగరంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రమాదం జరిగిన సమ యంలో సదురు వాహన దారున్ని పట్టుకుందామనుకుంటే నెంబర్‌ లేకపోవడంతో పోలీసులకు చిక్కడం లేదు. మరికొందరు చోరీలు, దోపిడిలకు నెంబర్‌ లేని వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వారికి చెక్‌ పెట్టేందుకు రాచకొండ పోలీసులు ప్రత్యక దృష్టి సారించారు. నంబర్‌ ప్లేట్స్‌ లేదా రిజిస్ట్రేషన్‌ లేని వాహనా లపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 48,998 వాహనాలపై మోటారు వాహన చట్టం కింద జరిమానా విధించారు.
చలాన్‌ వచ్చినా… రిజిస్ట్రేషన్‌ లేకుండానే రోడ్లపైకి
ఒక్కసారీ చలాన్‌ వచ్చినా మళ్లీ రిజిస్ట్రేషన్‌ లేకుండానే కొందరు వాహనదారులు ఉపయోగిస్తున్నారు. అలాంటి వారిని పట్టుకునేందుకు రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను రంగంలోకి దించారు. నిబంధనలు ఉల్లంఘించిన సదురు వాహనదారున్ని పట్టుకుని మోటారు వాహన చట్టంలోని సెక్షన్‌ 192 కింద కేసులు నమోదు చేస్తు న్నారు. వారిని ప్రత్యేక కోర్టుల ముందు హాజరుస్తున్నారు. దాంతో కోర్టు వారికి ఒక రోజు నుండి 3 రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 3,000 నుండి 5000 జరిమానాలు విధిస్తోంది. మరికొన్ని సార్లు రెండు రోజుల ట్రాఫిక్‌ కమ్యూనిటీ సేవ వంటి శిక్ష వేస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్‌ లేకుండా డ్రైవ్‌ చేయవద్దని, మద్యం సేవించి వాహనాలు నడుపొద్దంటూ ప్లకార్డులతో వారు ప్రధాన ట్రాఫిక్‌ జంక్షన్ల వద్ద నిలబెడుతున్నారు.

నేరాలను నివారించేందుకు చర్యలు
నెంబర్‌ప్లేట్‌ లేని వాహనాలే కాకుండా రిజిస్ట్రేషన్‌ లేని వాహనాలను కొందరు నేరస్తులు ఉపయోగిస్తున్నారు. వాటిపై సంచరిస్తూ నేరాలకు పాల్పడు తున్నారు. ఇంకొందరు ట్రాఫిక్‌ నిబం ధనలు పాటించడం లేదు. వాహ నాలను కొనుగోలు చేసిన 30 రోజు ల్లోగా (వాహన యజమానులు) తప్పని సరిగా వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. మోటారు వాహన చట్టం నిబంధనల ప్రకారం నంబర్‌ ప్లేట్లు ఉండాలి. నంబర్‌ ప్లేట్‌లపై చిహ్నాలు, ఎటువంటి రాతలు ఉండకూడదు. ముఖ్యంగా చైన్‌ స్నాచింగ్‌లు, ఇతర నేరాలను నివారించడానికి వాహనాల నెంబర్‌ ప్లేట్‌, రిజిస్ట్రేషన్‌ లేని వాహనాలపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహి స్తున్నాం. నిబంధనలు పాటించని వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం. – రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌.

Spread the love