సింగరేణితో ఎన్టీపీసీ ఒప్పందం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బొగ్గు సరఫరా కోసం ఎన్టీపీసీ సింగరేణి కాలరీస్‌తో నాలుగు ఒప్పం దాలు చేసుకుంది. కర్ణాటకలోని కుడిగీ థర్మల్‌ కేంద్రానికి ఏడాదికి 67.5 లక్షల టన్నులు, మహారాష్ట్ర షోలాపూర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి 28.2 లక్షల టన్నులు, రామగుండం ప్లాంట్లకు సంబంధించి బొగ్గు సరఫరా కోసం ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల మేరకు 207 లక్షల టన్నుల బొగ్గును మూడు ప్లాంట్లకు అవసరాన్ని బట్టి సర్దుబాటు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కోల్‌ మూమెంట్‌ జే ఆల్విన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఒప్పందలపై ఆ సంస్థ జనరల్‌ మేనేజర్‌ (మార్కెటింగ్‌) కే సూర్యనారాయణ, ఎన్టీపీసీ సౌత్‌ అండ్‌ వెస్ట్రన్‌ రీజినల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దేభశిష్‌ ఛటోపాధ్యాయ సంతకాలు చేశారు. సింగరేణి ఏజీఎం మార్కెటింగ్‌ ఎన్‌ రాజశేఖర్‌రావు, డీజీఎం టి శ్రీనివాస్‌, డీజీఎం కోల్‌ మూమెంట్‌ ఎస్‌ సం జరు, డీజీఎం మార్కెటింగ్‌ సురేంద్ర రాజు, అడిషనల్‌ మేనేజర్‌ మహేందర్‌రెడ్డి, ఎన్టీ పీసీ నుండి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఫ్యూయల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రదీప్‌ కుమార్‌ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

Spread the love