విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

నవతెలంగాణ – శంషాబాద్: ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణికురాలి దగ్గర విదేశీ కరెన్సీని గుర్తించారు అధికారులు. ఆమె నుండి రూ. 10 లక్షల విలువ గల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. వెంటనే  మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిని పోలీసులకు అప్పగించారు కస్టమ్స్ అధికారులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని పలు కోణాల్లో విచారిస్తున్నారు.

Spread the love