చేపూర్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని చేపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించినారు. గ్రామ సర్పంచ్ ఇందూర్ సాయన్న చెక్కులను లబ్ధిదారులకు అందజేసినారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కృషితో గ్రామ అభివృద్ధిలో నిర్విరామ కృషి చేస్తున్నట్టు తెలిపారు.