తిరుమలలో మరోసారి మద్యం కలకలం…

నవతెలంగాణ – తిరుపతి: తిరుమల కొండపై మరోసారి మద్యం  కలకలం రేపింది. శ్రీవారి ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్న హెచ్‌టి కాంప్లెక్స్‌లోని షాప్ నెం.78లో 5 మద్యం బాటిల్స్‌ను టీటీడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షాపును సీజ్ చేశారు. హెచ్‌టీ కాంప్లెక్స్‌లో వ్యక్తిపై హత్యాయత్నం ఘటన మరువకముందే అదే కాంప్లెక్స్‌లో మద్యం సీసాలు పట్టుబడడం కలకలం సృష్టిస్తోంది. తిరుమలలో నిఘా కరువైందంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Spread the love