– నవతెలంగాణ-ముషీరాబాద్
సమాజంలోని అన్ని సామాజిక వర్గాలకు వారి వారి దామాషా ప్రకారం చట్ట సభల్లో అవకాశం కల్పించాలని బహుజన ప్రజాశక్తి వ్యవస్థాపక కన్వీనర్ నల్ల లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బహుజన వర్గాలను సంఘటితం చేసి రాజ్యాధికారం వైపు నడిపించడమే బహుజన ప్రజాశక్తి ప్రధాన లక్ష్యమన్నారు. దక్కన్ దళిత వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ 135వ జయంతి వేడుకలను బాగ్‌లింగంపల్లి సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పలువురు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నల్ల లక్ష్మణ్ మాట్లాడుతూ 75 ఏండ్లుగా దేశాన్ని పాలించిన అగ్రకులా లకు చెందిన పాలకులు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిని అణిచివేశారని తెలిపారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అన్ని వర్గాల ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని చెప్పారు. మహనీయులు లక్ష్యాలను బహుజన ప్రజాశక్తి ప్రజల్లో తీసుకెళ్లి ప్రజలను బహుజన రాజ్యాధికారం వైపు చైతన్యం చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహు జన ప్రజాశక్తి రాష్ట్ర నాయకులు ముసునూరి యాదగిరి, నోముల గణేష్, చింత కింది రమేష్, హైదరాబాద్ ఇన్‌చార్జి ఇంద్రాల శేఖర్ కుమార్, పెదాల మల్లేష్, నగర ఇన్‌చార్జి శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.