ఎమ్మెల్యే గోవర్ధన్ చిత్రపటానికి పాలాభిషేకం

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని రామేశ్వరపల్లి గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గ్రామంలో దళిత ఫంక్షన్ హాలుకు నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘ అధ్యక్షులు పైతడి స్వామి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు అశోక్, ప్రతినిధులు బాలయ్య, అనిల్, సుమన్, శరత్, సురేష్, లింగం, పెంటయ్య, రామస్వామి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love