పోస్టర్‌ డిజైన్‌ పోటీల్లో పాల్గొనండీ..

–  వికలాంగుల శాఖ ఎండీ శైలజ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆసక్తి గల వికలాంగ అభ్యర్థులు, వయో వృద్ధుల, ట్రాన్స్‌ జెండర్స్‌ పోస్టర్‌ డిజైన్‌ పోటీల్లో ్ల పాల్గొనాలని వికలాంగుల శాఖ సంచాలకులు బి శైలజ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 15ఏండ్ల వయస్సు వారు అర్హులని తెలిపారు. పాటలు, పద్యరచన పోటీలు కూడా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. 18ఏండ్ల వయస్సు పైబడిన వారికి షార్ట్‌ వీడియో మేకింగ్‌ పోటీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు జూన్‌ 20లోగా https//forms.gle/eEQCs నందు ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తులు పంపాలని సూచించారు. నోటిఫికేషన్‌ను రద్దు పర్చేందుకు,మార్చేందుకు కూడా పూర్తి అధికారం సంచాలకులకు ఉంటుందని తెలిపారు. ఇతర వివరాల కోసంwww.wdsc.telangana.gov.in నూ, 9652394751 ను సంప్రదించవచ్చు.

Spread the love