ఎస్సీ రూరల్ అధ్యక్షునిగా ఎన్నికైన పాశం కుమార్  దళితుల అభినందనల వెలువ..

నవతెలంగాణ-డిచ్ పల్లి :  ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పాశం కుమార్ ‌‌కు అరుదైన గౌరవం దక్కింది.బిఅర్ఎస్ నిజామాబాద్ రూరల్ ఎస్సీ కన్వీనర్ గా ఆర్టీసీ చైర్మన్, నిజామబాద్ రూరల్  ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియామకం చేశారు. ఆదివారం ఇందల్ వాయి బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద కన్వీనర్ గా ఎన్నికైన పాశం కుమార్ కు పూలమాలలు, శాలువాతో అంబెడ్కర్ సంఘ సభ్యులు,జర్నలిస్ట్ మిత్రులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు సంగెం కిష్టయ్య మాట్లాడుతూ  దళితుల పక్షాన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చోరువతో పాశం కుమార్ కు పదవి దక్కిందన్నారు. ఎస్సీ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ గా ఎన్నికైన పాశం కుమార్ మాట్లాడుతూ దళితుల పక్షాన అనునిత్యం పోరాటం చేస్తూ దళితుల  పక్షాన ఏ పథకాలు వచ్చిన దళితులకు వర్తించేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెక్ పావర్ ఎర్రోళ్ల సాయన్న, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love