ముత్తారం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నవతెలంగాణ-ముత్తారం
ముత్తారం మండలంలో రానున్న 48 గంటలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ కె. వరంధన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్షానికి తడిసిన విద్యుత్ స్థంబాలను, గోడలను తాక కూడదని తెలిపారు. చెట్ల క్రింద ఉండ రాదని, ఫోన్స్ ఉపయోగించరాదని తెలిపారు. రైతులు బావులు, బోర్ల వద్ద కరెంట్ పెట్టె ముందు తడిసిన స్టార్టర్ బాక్స్ ను, ఫ్యుజ్ బాక్స్లను చేతులతో ముట్టుకోరాదని తెలిపారు. వర్షానికి రోడ్లు కొట్టుకుపోయి, గుంతలు ఏర్పడి, అందులో నీరు నిల్వ ఉండి ఆ గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమా దానికి గురి అయ్యి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే నెంబర్లు, తహసిల్దార్ కే వరంధన్ 79 9507 0745, ఎంపీడీవో శ్రీనివాస్జ్ ,92814 86919, ఎంపీఓ వేణుమాధవ్ 9391062577 సంప్రదించవలసిందిగా కోరారు.