భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

– కూలీ పోయే ఇండ్లలో ఉండొద్దు
– చెరువులు, వాగుల వద్దకు వెళ్లొద్దు
– విద్యుత్‌ స్తంభాలతో జాగ్రత్త వహించాలి
– అత్యవసరమైతే పోలీసులను సంప్రదించాలి చేవెళ్ల సీఐ లక్ష్మారెడ్డి
నవతెలంగాణ- చేవెళ్ల
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేవెళ్ల సీఐ లక్ష్మారెడ్డి అన్నారు. సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఆదేశాల మేరకు గురువారం పీఎస్‌ పరిధిలోని గ్రామాల్లోని ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కూలీ పోయే ఇండ్లలో నివసించే ప్రజలను సురక్షిత నివాసాలకు తరలించాలని తెలిపారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ఇండ్లలోకి వర్షపునీరు చేరకుండా జాగ్రత్త చర్యలు తీసుకో వాలన్నారు. దీంతో పాటు గ్రామ సమీపంలోని చెరువులు, వాగుల వద్ద వెళ్లరాదని, పిల్లలు, యువకులు వెళ్లకుండా తల్లి దండ్రులు దృష్టిసారించాలన్నారు. ముఖ్యంగా విద్యుత్‌ స్తంభాల వద్దకు, ఇంట్లో ఎలక్ట్రిక్‌ వస్తువుల నుంచి విద్యుత్‌ ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు ట్రాన్స్‌ ఫార్మర్లతో, కరెంటు మోటార్లతో జాగ్రత్త వహించాలని తెలి పారు. అదే విధంగా మూసి నది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలి పారు. అత్యవసరమైన పరిస్థితులు ఏర్పడితే పోలీస్‌ వారికీ లేదా డయల్‌ 100 నెంబర్‌కు కాల్‌ చేయాలని సూచించారు.
చేవెళ్ల మండల పరిధిలోని తంగడపల్లి గ్రామంలోని గడ్డమీది నర్సింలు ఇంటి వెనుక భాగం కూలిపోయింది. వర్షాకాలం గోడలు పదను ఉండటంతో ఈ ఘటన జరి గింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి 20 గొర్రెలు, మూడు మేకలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకా రం… కుమ్మెర గ్రామానికి చెందిన చిన్న పెంటయ్య గొర్రె లను పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఎప్పటి మాదిరిగానే బుధవారం కూడా రోజు మాదిరిగానే గొర్రెలను మేపుకుని వచ్చి, ఒకే చోట మందను పంపించి, ఇంటికి వెళ్లాడు. తెల్లవారు జామున గొర్రెల మంద వద్దకు వచ్చి చూడగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గత నాలుగు రోజులుగా కురస్తున్న వర్షానికి వణుకు పట్టి మృత్యువాత పడ్డాయని బాధితుడు తెలిపారు. దీంతో దాదాపుగా రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆ బాధిత కుటుం బాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.