ప్రజలు బీఆర్ఎస్ నాయకులను నిలదీయాలి..

నవతెలంగాణ- ఆర్మూర్
గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వార్డుల్లో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వార్డులలో తిరుగుతూ మాయమాటలు చెప్పి మరోసారి ఆర్మూర్ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని వార్డు సభ్యులు తెలుసుకోవడానికి వచ్చే బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని సీపీఐ పార్టీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి అరేపల్లి సాయిలు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవన్ రెడ్డి ఆర్మూర్ ను బ్రష్టు పట్టించారని అనేక సందర్భాల్లో ఆర్మూర్ ను అభివృద్ధి పథంలో ముందు నిలిపనని చెప్పడానికి కొంచెమైనా ఏమైనా ఉందా అని అన్నారు.ఎప్పుడో అభివృద్ధి పనులు జరిగిన సిద్ధుల గుట్ట అభివృద్ధి ఎమ్మెల్యే హయంలోనే అయిందని కొందరు బీఆర్ఎస్ నాయకులతో బాజన చేయించడం మానుకోవాలని ఎంతో సుభిక్షంగా ఉన్న అర్మూర్ లో గుండా రాజకీయాలకు తెరలేపిన ఎమ్మెల్యే గా అధికారంలో వున్నాను కాదా అని ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడమే కాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రెస్స్ మిట్ లు పెట్టకుండా ఆర్మూర్ లోని గెస్ట్ హౌస్ ను తొలగించి ఎమ్మెల్యే క్యాంప్ అపిస్ కట్టున్నరని ఆర్మూర్ లో జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధి సున్న అని వార్డుల్లో సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయని ఇలాగే ప్రతిపక్ష పార్టీల నాయకులను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడకు పోతే జీవన్ రెడ్డి ఒంటరి అవ్వడం ఖాయం అని అన్నారు.