భట్టి విక్రమార్కతో పొంగులేటి సమావేశం

నవతెలంగాణ – హైదరాబాద్
భట్టి విక్రమార్కతో పొంగులేటి సమావేశం అయ్యారు. కేతేపల్లి లో పాదయాత్ర శిబిరంలో భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. పాదయాత్రలో భట్టి విక్రమార్క అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. భట్టి విక్రమార్క ను పరామర్శించారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. నిన్న పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి… ఇంటికి రేవంత్..కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వెళ్లారు. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని పార్టీలోకి చేరాలని అప్పీల్ చేశారు రేవంత్..కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. ఇక ఇవాళ భట్టి తో పొంగులేటి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి…కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని అందరికీ అర్థమౌవుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Spread the love