ఎం.డి.ఓ శ్రీనివాస్ తో భేటీ అయిన పూజ

– గ్రామాల్లో స్థానిక సమస్యలు పరిష్కరించండి….
– ములకలపల్లి ఎం.పి.డి.ఒ తో వగ్గెల పూజ భేటీ….
నవతెలంగాణ-అశ్వారావుపేట
మండలంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో మౌళిక   సదుపాయాలు కల్పించాలని,గ్రామాల్లో స్థానిక సమస్యలు పరిష్కరించాలని టి.పి.సి.సి సభ్యురాలు వగ్గెల పూజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. బుధవారం ఆమె ములకలపల్లి ఎం.పి.డి.ఒ శ్రీనివాస్ తో ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా మాదారం పంచాయతీ మంగపేట,మండల కేంద్రం అయిన ములకలపల్లి పంచాయతీ విజయపురి కాలనీలోని పలు సమస్యలు, కస్తూర్బా గాంధీ బాలికా  విద్యాలయంలో,డస్ట్ బిన్ లు హ్యాండ్ పంప్ ఏర్పాటు కోరారు.రాజేపేట కాలనీ లో మంచినీటి సమస్యను పరిష్కరించాలని ములకలపల్లి పంచాయతీ సెక్రటరీ కి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ కాంగ్రెస్  నాయకులు ఎస్.కే ఖాదర్ బాబా,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పాలకుర్తి రవి,సక్కుబాయి,నల్లి సత్యవతి,నిర్మల,నాగమణి, వెంకయ్య,లంక గాంధీ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ బషీర్ తదితరులు పాల్గొన్నారు.