అక్రమ ఇసుక నిల్వల స్వాదీనం..

నవతెలంగాణ-బెజ్జంకి
తహసిల్దార్ విజయ ప్రకాశ్ రావు ఉత్తర్వుల మేరకు మండల పరిదిలోని గాగీల్లపూర్ గ్రామ శివారుల్లో అక్రమ ఇసుక నిల్వలను బుధవారం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.మూడు అక్రమ ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకున్నామని రెవెన్యూశాఖ, పోలిస్ శాఖాధికారులు తెలిపారు.ఎస్ఐ ప్రవీన్ రాజు, రెవెన్యూశాఖ ఆర్ఐ రాజయ్య,అయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
 అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు..
గత కొద్ది నేలలుగా అధికారుల కళ్లముందే రాత్రింబవళ్లు అక్రమ ఇసుక రవాణ జోరుగా సాగుతున్న బుధవారం అధికారులు తుతూ మంత్రంగా సోదాలు నిర్వహించి అక్రమ ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకోవడం విడ్డూరంగా ఉందని గాగీల్లపూర్ గ్రామంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అక్రమ ఇసుక రవాణకు అనువుగా ఉన్న వేసవికాలం రోజుల్లో అధికారులు అలసత్వం వహించి చట్టపరమైన చర్యలు చేపట్టకుండా వానకాలంలో అక్రమ ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకోవడం తమ ఉనికిని చాటుకోవడానికేనని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.అక్రమ ఇసుక రవాణాను ఆరికట్టడానికి సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి భారీ గుంతలేర్పాటు చేసిన రవాణదారులు మరో అక్రమ మార్గం ఏర్పాటుచేసుకుని ఇష్టానుసారంగా ఇసుక రవాణ సాగించారని..అధికారుల అండదండలతోనే ఇసుక అక్రమ రవాణ జోరుగా సాగించారని ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఇసుక దోపిడిదారులపై కఠిన చర్యలు చేపట్టాలని గాగీల్లపూర్ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Spread the love